PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కారుణ్య నియామక ఉత్తర్వులు ఇచ్చిన సీఎం కి కృతజ్ఞతలు..

1 min read

– వృత్తిధర్మంలో సంతృప్తిని ఇచ్చిన అంశం..

 డి పి ఓ విశ్వనాధ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  వేల్పూరు గ్రామ పంచాయతీలో స్వీపరుగా సుమారు 30 సంవత్సరాలు సేవలు అందించి సర్వీసులో ఉండగానే 2014లో మరణించారు. వారు ఎస్సీ రెల్లి సామాజిక వర్గానికి చెందిన వారు. వారికీ భార్య ఆరుగురు పిల్లలు ఉన్నారు. అత్యంత పేద వర్గానికి చెందిన కుటుంబం. కుటుంబ సభ్యులు ఇప్పటికి కూలిపనులు చేసుకుంటూ  జీవిస్తున్నారు. రాంబాబు మరణాంతరం కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ప్రభుత్వం కారుణ్య నియామకం కల్పించాల్సి ఉన్నది. అయితే ఆ కుటుంబం ఉన్నత అధికారులకు గడువులోపు దరఖాస్తు ఇవ్వకపోవడం వలన వారి అభ్యర్ధనను జిల్లా పంచాయతీ కార్యాలయం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తిరస్కరించింది.  2019లో జిల్లా పంచాయతీ అధికారిగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భాద్యతలు తీసుకున్న తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సామాజిక అంశాలపై స్పందిస్తారని తెలుసుకున్న  రాంబాబు  కుటుంబం సభ్యులు అప్పటి డీపీఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను కలిసి తిరిగి దరఖాస్తూ చేసుకొని కారుణ్య నియామకం కోసం అభ్యర్థించారు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ రాంబాబు కుటుంబ సభ్యుల సామాజిక ఆర్ధిక అంశాలను పరిశీలించి. నిరుపేద రెల్లి సామాజిక వర్గానికి (ఎస్సీ కులం) చెందిన గ్రామ పంచాయతీ స్వీపర్ చనిపోతే అవగాహన రాహిత్యంతో కారుణ్యనియామకం సకాలంలో ప్రభుత్వానికి పంపకపోవడం వలన వారి కుటుంబ ప్రతిపాదనలు అప్పటి డీపీఓ, పశ్చిమగోదావరి జిల్లా వారు తిరస్కరించారని తెలుసుకొని నిరక్ష్యారాసులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ జీఓలపై, చట్టాలపై అంతగా అవగాహన లేకపోవడం వలన సకాలంలో వారి కుటుంబం కారుణ్య నియామకానికి సంబంధించి దరఖాస్తూ చేసుకోలేకపోయారని, వ్యవస్థలో ఉన్న లోపాల వలన ఉద్యోగం కోల్పోయి ప్రస్తుతం వారు దుర్భర జీవితం గడుపుతున్నారని, 30 సంవత్సరాలు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటుకు సేవలు అందించి అవగాహన రాహిత్యంతో కారుణ్య నియామకం ఉద్యోగ అవకాశం కోల్పోయారని, మానవియకోణంలో ఆలోచించి కారుణ్య నియామక ఉత్తర్వులు ఇచ్చే విషయంలో వారి అభ్యర్ధనను పునః పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రతిపాధనలను ప్రభుత్వానికి అప్పటి డీపీఓ  డిసెంబర్ 2019లో పంపడం జరిగింది. డీపీఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ రాసిన జస్టిఫికేషన్ రిపోర్టును మానవీయా కోణంలో ఆలోచించి సహకరించమని కోరగా   స్పందించిన  కమీషనర్, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ వారు ప్రభుత్వానికి పంపిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం, ఉద్యోగ అవకాశం కల్పిస్తు జిఓ 773ను తేదీ 09.11.2023న విడుదల చేసింది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2019లో తూతిక శ్రీనివాస విశ్వనాధ్ డీపీఓగా సేవలు అందిస్తున్న  సమయంలో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం 2023లో ఆమోద ముద్రవేయడం ప్రస్తుతం తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఏలూరు జిల్లాలో అదే డీపీఓగా హోదాలో ఉండడం గమనార్హం. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ స్పందిస్తూ చాలా సంతోషంగా ఉందని,  మానవీయకోణంలో స్పందించి,  నిరుపేద కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటుకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.

About Author