NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిఎస్సి 2025 మెరిట్ లిస్టు క్యాటగిరి వైజ్ కట్ ఆఫ్ మార్కులు విడుదల చేయాలి

1 min read

కలెక్టరేట్ వద్ద బీఎస్పీ ధర్నా  కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్  మెమోరాండం

అమలాపురం, న్యూస్​ నేడు:   2025 డిఎస్సి నియమకంలో రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది డీఎస్సీనిరుద్యోగ  అభ్యర్థులు అయామయానికి గురయ్యారని కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వకుండా జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు అధిక శాతం ఉద్యోగ నియమకాలు ఇవ్వటం వలన రిజర్వేషన్ కు సంబంధించిన కులాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఎస్సీ.ఎస్టీ.బీసీ మైనార్టీ,నిరుద్యోగ యువకులు మెరిట్ వచ్చినప్పటికీ వారిని జనరల్ కేటగిరిలో చూడకుండా రిజర్వేషన్ ప్రకారం మాత్రమే ఉద్యోగ నియమకాలు ఇవ్వడం జరిగిందని,రిజర్వేషన్ కులాలకు చెందిన అభ్యర్థులకు మెరిట్ లిస్టులో వస్తే వారిని జనరల్ కేటగిరిలో చూడాలని ఆ విధంగా చూసినట్లయితే తిరిగి రిజర్వేషన్ కేటగిరి లో కూడా మిగతా వారికి అవకాశం వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వం మెరిట్ లిస్టును విడుదల ఇవ్వకుండా నియమక పత్రాలు వాట్సాప్ ద్వారా పంపించి గోప్యంగా డీఎస్సీ నియామకం ఇవ్వడం జరిగింది.దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శన జరిపి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారికి మెమొరండం సమర్పించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బూసి జాన్ మోషే జిల్లా ఇన్చార్జ్ కుసుమ వెంకటేశ్వరరావు జిల్లా కోశాధికారి కాండ్రేగుల గంగరాజు కార్యదర్శి కోణాల ప్రకాష్ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పొలమూరి మోహన్ బాబు కోలా త్రిమూర్తులు వాకపల్లి హరీష్ అమలాపురం అధ్యక్షులు పేయ్యల ప్రతాప్ కుమార్ ముమ్మిడివరం భీమేష్ కొత్తపేట అధ్యక్షులు గుర్రపు కొత్తయ్యగన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు తాడి రాంబాబు రాజోలు అధ్యక్షులు నెల్లి ప్రసాదరావు ఆకుమర్తి భూషణం జనపల్లి సత్యానందం నెల్లిబాలు జెడిఎస్ రాజు. కుసుమ శ్రీనుపులపర్తిచందుకురాటిచందర్రావు మోకా శ్రీను భూపతి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *