హామీలను మరచిన ‘కూటమి ప్రభుత్వం’..
1 min read
-మండిపడ్డ సీపీఎం నాయకులు
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని హామీలు మరిచి అప్పుల భారాన్ని ప్రజలపై మోపే విధంగా బడ్జెట్ ఉందని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు ప్రభుత్వంపై మండిపడ్డారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూలక్ష కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించటాన్ని బట్టి చూస్తే ప్రజలపై భారాన్ని మోపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుందని అన్నారు.శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 3 లక్షల 22 వేల కోట్ల రూ.లు బడ్జెట్లో మన రాష్ట్రానికి అరకొరగా ఉందన్నారు.అలగనూరు రిజర్వాయర్ గండిపడి ఏళ్లు గడుస్తున్నా గండి మరమ్మతులకు నిధులు కేటాయించలేదు.మల్యాల హంద్రీనీవా ద్వారా మిడుతూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3 వేలు కేటాయించలేదన్నారు.అన్నదాత సుఖీభవ,తల్లికి వందనం, ఉచిత ఇసుక,మహిళలకు 1500 మరియు వివిధ పథకాలకు నిధులు,ఉపాధి హామీ పనులకు కేటాయించలేదన్నారు.ఈ బడ్జెట్ రైతు,వ్యవసాయ,ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పక్కిర్ సాహెబ్,నాగమణి, గోపాలకృష్ణ,ఎం కర్ణ,బెస్తరాజు, మదిలేటి,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.