పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్ లోగా పూర్తిచేయాలి
1 min read
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశం
పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం,భూసేకరణ, కాలనీల నిర్మాణపనులపై అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్ లోగా పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి మంగళవారం పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణపనులపై అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల పూర్తిపై ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాల ననుసరించి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను డిసెంబర్ లోగా పూర్తిచేసి నిర్వాసితులను సదరు కాలనీలకు డిసెంబర్ లోగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ లు జెడ్. రమేష్, విజయరత్నం, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, భూసేకరణ విభాగం అధికారులు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.


