NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశ అభివృద్ధి యువత చేతుల్లోనే

1 min read

– క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు

 కర్నూలు, న్యూస్ నేడు:  జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు మరియు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగినది, ఈ సందర్బంగా క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ యువత తోనే దేశ అభివృద్ధి జరుగుతుందని, దేశ అభివృద్ధికి దృఢ సంకల్పంతో యువత ముందుకు నడవాలని కోరారు,  స్థానిక యువత, ప్రపంచ మరియు దేశ అభివృద్ధి ఆశయాలను అనుగుణంగా సమాజ-ఆధారిత వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాత్రను పోషించాలని, జాతీయ మరియు అంతర్జాతీయ నిబద్ధతలతో స్థిరత్వాన్ని కొనసాగిస్తూ సమాజ అవసరాలతో వాటిని సమలేఖనం చేయాలని కోరారు.  అలాగే స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను వమ్ము కాకుండా, వారి  ఆశయాలకు అనుగుగుణగా నడవాలి అని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా!! శ్రీనివాస్, సెట్కూర్ సీఈఓ వేణు గోపాల్  మాట్లాడుతూ యువత యుక్త వయసులో అనవసర కార్యక్రమాలకు సమయం వృధా చేయకుండా స్థిరమైన లక్ష్యాలు ఏర్పరుచుకొని, క్రమ శిక్షణతో, అంకుఠిత దీక్షతో లక్ష్య సాధనకు కృషి చేస్తే యువత తప్పక విజయం సాధించడం సులభమని తెలిపారు.ఇందులో భాగంగా నిర్వహించిన క్లస్టర్ అనుబంధ కళాశాలలు 1) సిల్వర్ జూబిలీ ప్రభుత్వ కళాశాల, 2) ప్రభుత్వ పురుషల డిగ్రీ కళాశాల, 3) కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో  నిర్వహించిన వకృత్వ, డిబేట్ అండ్ గ్రూప్ డిస్కషన్ పోటీల విజేతలకు మెమెంటో మరియు ప్రశంసా పత్రాలు అందజేయడమైనది.    ఈ కార్యక్రమంలో కె.వి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వెంకట రెడ్డి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వైస్  ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణ , చైల్డ్ సైకాలజిస్ట్ శ్రీమతి జ్యోతిర్మయి,  క్లస్టర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author