NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి

1 min read

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

బనగానపల్లె, న్యూస్ నేడు : క్షేత్ర స్థాయి ప్రజల నుంచి వచ్చే సమస్యలు, వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశించారు.. నేటి మధ్యాహ్నాం బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రత్యక్షంగా స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి  తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే చట్టబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో మంత్రి సంబంధిత అధికారులతో అక్కడిక్కడే ఫోన్ లో మాట్లాడి ఆయా సమస్యలకు పరిష్కరించడం జరిగింది. ఈ అర్జీలు స్వీకరణ కార్యక్రమంలో సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో బాధితుల నుంచి సంతోషం వ్యక్తమైంది. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహంచిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

About Author