అరటి తోటలు, నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ..
1 min read
పల్లెవెలుగు, నంద్యాల: సిరివెళ్ల మండలం మహాదేవపురం గ్రామంలో అరటి తోటలు, పూల తోటల నర్సరీని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పరిశీలించారు. మంగళవారం సిరివెళ్ల మండలం మహాదేవపురం, బోయలకుంట్ల గ్రామాలలోని అరటి తోటలు, పూల, కూరగాయల తోటల నర్సరీని పరిశీలించారు. రైతుల పొలాలను సూపర్ చెక్ చేస్తూ ఏ మొక్కలను పెంచుతున్నారనే వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెంపకం, నిర్వహణ బాగుండే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.బోయలకుంట్ల గ్రామంలో జింక నారాయణ, లక్ష్మీ దంపతుల పూల, కూరగాయ తోటల నర్సరీలను పరిశీలిస్తూ మొక్కల పెంపకం, నిర్వహణ బాగుండడంతో కలెక్టర్ ప్రశంసిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు.