NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జ్వాలా తోరణ ప్రజ్వలన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీ గురుదత్త జై గురుదత్త ఓం నమః శివాయ శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా  శ్రీ గౌరీ శంకర స్వామి వారికీ ప్రాతః కాలం నుండి లఘున్యాస పూర్వక రుద్రాభిషేకములు విశేష అర్చనలు జరిగినవి, అనంతరం కుబేర పాశుపత హోమసహిత శ్రీ లలిత సహస్రనామ మరియు లక్ష్మీ సహస్ర హోమం జరిగినది.సాయంకాలం శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ప్రదోష కాలర్చన అభిషేకం విశేష అర్చనలు జరిగినవి అనంతరం శ్రీ మహా గౌరీ సమేత శ్రీ గౌరీ శంకర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను దేవాలయ మాడ వీధులలో ప్రదక్షిణం పూర్వకంగా పల్లకి సేవ జరిపి ఆలయ ప్రాంగణంలో జ్వాలా తోరణ ప్రజ్వలన కావించి ఆది దంపతులతో భక్తులు జ్వాలా తోరణ ప్రధక్షణం చేసుకున్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రులైనారు.

About Author