మొక్కలు నాటిన జిల్లా రిటైర్డ్ జడ్జి మోహన్ రావు..
1 min read
డిగ్రీ కళాశాలలో కార్తీక వనమహోత్సవం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్,కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్తీక వన సమారాధన,వన మహోత్సవంలో భాగంగా గురువారం ప్రిన్సిపాల్ రంగముణి అధ్యక్షతన హరిత్రాంధ్ర మిషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జిల్లా జడ్జ్ పల్లె మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపన్యాసంలో చదువుకునే స్థాయి నుంచే విద్యార్థినీ విద్యార్థులు సామాజిక స్పృహ,సామాజిక బాధ్యత కలిగి ఉండాలని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులు వికలాంగులు,నిస్సహాయులకకు మానవతా దృక్పథంతో సహాయం అందించాలని తాము జిల్లా జడ్జిగా సర్వీసులో ఉన్నప్పుడు సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని రాబోవు ఐదు సంవత్సరాల్లో హరితవనం లాగా తయారవ్వాలని విద్యార్థులతో అన్నారు.తర్వాత మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో వెంకట్రావు,నందికొట్కూరు మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి,కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మండ్లెం రామిరెడ్డి,రిటైర్డ్ టీచర్ శివ రాముడు 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోల్మాన్ రాజు,జార్జ్,ఖలీల్,ఆర్ట్ శీను,శ్రీకాంత్ గౌడ్,రంగస్వామి, గోరేటి వెంకన్న,వైస్ ప్రిన్సిపాల్ రవి,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఖాజా హుస్సేన్ పాల్గొన్నారు.

