పులికొండ, చందోలి గ్రామాల రైతులకు సహస్ర కంపెనీ చేసిన మోసాలను అరికట్టాలి
1 min read
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్
న్యూస్ నేడు, పత్తికొండ: చందోలి గ్రామ రైతుల భూములకు రస్తా సౌకర్యం కల్పించి పులికొండ గ్రామ రైతుల భూములపై సహస్ర కంపెనీ చేసిన మోసాలపై చర్యలు తీసుకొని ఆన్లైన్లో తొలగించిన భూములను తిరిగి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ ఆధ్వర్యంలో చందోలి మరియు పులికొండ గ్రామాల రైతుల భూముల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం రైతులతో ర్యాలీ నిర్వహించి, పత్తికొండ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి .రామకృష్ణ రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, హోసూర్ మధు, సిఐటియు జిల్లా నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి రవిచంద్రలు మాట్లాడుతూ, పత్తికొండ మండలంలోని చందోలి గ్రామ రైతుల భూములకు పూర్వకాలం నుండి ఉన్న ప్రస్థానం రైతుల భూములకు పోకుండా గుండ్లు పెద్ద పెద్ద రాళ్లు వేసి అడ్డుపడిన వారిపై చర్యలు తీసుకొని రస్తా సౌకర్యం కల్పించాలని కోరారు. పొలాలకు రస్తా లేకుండా ఎలా వెళ్లి పండించుకుంటారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులికొండ గ్రామాల రైతుల భూములలో గాలిమర ఫ్యాన్లు (విద్యుత్తు ఉత్పత్తి కొరకు) సహస్ర కంపెనీవారు భూములను లీజుకు కొంత భాగం ఇస్తే మరి కొంత భాగం ఆన్లైన్ లో నమోదు చేసుకొని రైతులను పంట రుణాలకు సంక్షేమ పథకాలు అందుతాయని నమ్మబలికి అగ్రిమెంట్ చేసుకుని మోసపూరితంగా వారితో తప్పుడు అగ్రిమెంటుపై సంతకాలు చేయించారు.



