విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రెండో రోజు వైసిపి రిలే నిరాహార దీక్షలు
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. డీఎస్సీ–2025 నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవినీతిపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలో క్రిష్ణగిరి ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, యువకులు పాల్గొని తమ నిరసన తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.వైఎస్సార్‌సీపీ నేతలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీతో కలిసి ఉద్యమాలు చేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని తెలిపారు.రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయంటూ ఆయన విమర్శించారు. కేవలం టీడీపీ నేతల కోసమే పోలీసులు పనిచేయడం ప్రజాస్వామ్యానికి, ప్రజా పాలనకు మంచి పరిణామం కాదని హితవు పలికారు. ప్రతిపక్షాలు, ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


