NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

22  న కురువ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం…

1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘము                   

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు, నంద్యాల కురువ కులస్తులందరి పదవ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన వారికి గతంలో 5వ తేదీలోపల పంపించిన ప్రతిఒక్కరికి పోత్సాహ బహామతులు ఈ నెల 22వ తేది ఇవ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ ప్రదానకార్యదర్శి కె.అనిత తేలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు గారు పాల్గొంటారని ఆయన చేతుల మీదుగా జ్ఞాపిక, సర్టిఫికెట్లు,నగదు బహుమతిని అందజేస్తామని కమిటీ సభ్యులు తేలిపారు. ఈ సమావేశం కర్నూలు జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులో ఉన్న శ్రీ  భీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణం నందు జరుగు జరుగుతోందని ఈ నెల 22 వ తేదీన ఉదయం పది గంటలకు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలసుంకన్న,జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, ఉరుకుందు, వేంకటేశ్వర్లు కోశాధికారి కె. సి.నాగన్ననగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు బి. సి. తిరుపాల్,బి. బాలరాజు పెద్దపాడు పుల్లన్న, కె. వెంకటేశ్వర్లు,కె. మద్దిలేటి,కోత్తపల్లి దేవేంద్ర  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *