ఆలయాల పాలకమండలి ఏర్పాటుకు రంగం సిద్ధం
1 min read
పల్లెవెలుగు వెబ్ మహానంది: పలు ఆలయాలకు సంబంధించి పాలకమండలి ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు విశ్వాసనీయ సమాచారం. మహానంది దేవస్థానం తో పాటు, సూర్య నంది, కృష్ణ నంది మరియు వివిధ గ్రామాల్లోని గ్రూప్ టెంపుల్ ఆలయాలకు సంబంధించి పాలకమండలి నియామకం కొరకు రహస్యంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. గ్రూపులుగా ఏర్పడి మా వారికి కావాలంటే కాదు మా వర్గం వారికి కావాలని ఒక నాయకుని వద్ద చెవిలో జోరీ గల్లా చాట భారతం వినిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవి అన్ని కావు గ్రామాల్లో మీరు చర్చించుకుని పేర్లను త్వరలో సిద్ధం చేసి వివరాలు అందజేయాలని అ నాయకుడు సూచించినట్లు తెలిసింది. గ్రామాల్లోని గ్రూప్ టెంపుల్లో చైర్మన్ పదవి కొరకు తీవ్ర పోటీ నెలకొన్నట్టు సమాచారం. మహానంది దేవస్థానం పాలక మండలికి సంబంధించి చైర్మన్ మరియు మండల సభ్యుల పదవులపై తీవ్ర పోటీ నెలకొనడంతో పాటు వర్గాలుగా విడిపోయి పదవులు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఉగాది పర్వదిన అనంతరం గ్రూప్ టెంపుల్ లకు సంబంధించి పాలక మండళ్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. మహానంది ఆలయానికి సంబంధించి చైర్మన్ మరియు సభ్యుల ఏర్పాటు ఆలస్యం అవుతుందా లేక చిన్న పెద్ద ఆలయాలు అని తేడా లేకుండా ఒకేసారి పాలక మండలి ఏర్పాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.