సొంత పార్టీ కార్యకర్తలే హోం మంత్రి ఇంటిని ముట్టడించారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శనివారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించారు. బెంగళూరులో జ్ఞానేంద్ర ఇంటి ప్రాంగణంలోకి చొరబడి బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని, హోం శాఖను నిర్వహించటంలో విఫలమైన మంత్రి.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తర్వాత ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్ చేసి 30 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.