పోటీలను ప్రారంభించిన మంత్రి బీసీ..ఎమ్మెల్యే
1 min read
ఎద్దుల పోటీల్లో మొదటి విజేత రాయవరం
నేడు న్యూ కేటగిరి బండ లాగుడు పోటీలు
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గ శ్రీ భ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఆరుపళ్ల విభాగం ఎద్దుల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి,గౌరు వెంకటరెడ్డి హాజరై శనివారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ఎద్దుల పోటీలను వారు ప్రారంభించారు.ఈ పోటీలను వారు తిలకించారు.ఈ పోటీల్లో మొత్తం 12 జతలు పాల్గొన్నాయి.ఈ పోటీలు వ్రతవతరంగా జరిగాయి. మొదటి విజేతగా నాగర్ కర్నూలు రాయవరం నుండి అక్షరా రెడ్డి మొదటి స్థానంలో నిలిచి లక్ష రూపాయలు సంపాదించాయి.2 వ స్థానంలో బీరం బుల్స్ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఎస్ కొత్తూరు పాణ్యం,, మూడవది బోరెడ్డి నారాయణ రెడ్డి పెద్దకొట్టాల,నాల్గవది అక్షరా రెడ్డి రాయవరం, ఐదవది అర్షణ్,అబ్దుల్ భాష సాతర్ల-ఇటిక్యాల,,ఆరవది బి తాండ్రపాడు చిన్న రత్నం, ఏడవది అంజిరెడ్డి కంచుపాడు గద్వాల,8 వ బహుమతి వెంకట కృష్ణయ్య-పిన్నాపురం గెలిచిన వృషభ రాజుల యజమానులకు సాయంత్రం దాతలు నగదును అందజేశారు.ఈ రోజున ఆదివారం న్యూ కేటగిరి బండలాగుడు పోటీలు ఉదయం 8 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని మొత్తం 8 బహుమతులు లక్ష 50 వేలు మొదటి నుంచి 10 వేల వరకు బహుమతులు ఉన్నాయని కమిటీ నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చి ఎండను సైతం లెక్కచేయకుండా పోటీలను తిలకించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో టి మద్దిలేటి, ఎస్ఐ సునీల్ కుమార్,కమిటీ నిర్వాహకులు మాజీ ఆలయ చైర్మన్ జికే సుధాకర్, బజార్,కెవి మధు,జయకృష్ణ, శ్రీనివాసులు మరియు నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి,శకునాల మురళి రెడ్డి,రజాక్ భాష తదితరులు పాల్గొన్నారు.
