NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు ప్రభుత్వానికి సమాచారశాఖ వారధి

1 min read

సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోనికి తీసుకువెళ్లాలి

రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ముసునూరు లో పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలలోనికి తీసుకువెళ్లాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు.  ముసునూరు ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం సందర్భంగా సమాచార శాఖ రాష్ట్ర కార్యాలయం ఏలూరు జిల్లా కార్యాలయంనకు అందించిన వీడియో కెమెరాను సమాచార శాఖ సిబ్బందికి మంత్రి అందించారు.  ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి సమాచార శాఖ వారధి లాంటిదన్నారు.  ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం, వాటిపై ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయడం సమాచార శాఖ విధి అన్నారు. సమాచారశాఖను మరింత పటిష్టం చేస్తామన్నారు.  ప్రభుత్వం అమలు చేసే ప్రతీ పధకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా  ప్రభుత్వ సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.   డివిజినల్ పౌర సంబంధాధికారి సిహెచ్. దుర్గాప్రసాద్, సిబ్బంది గంగాధర్, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author