ఏపీ డబ్ల్యు జేఎఫ్ డైరీ ని ఆవిష్కరించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర రాజధాని అమరావతి వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్స్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) డైరీని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలువు పార్థసారథి శనివారం ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, ఫెడరేషన్ నాయకులు ఎం.బి.నాధన్, రాఘవేంద్ర శేఖర్, ఎపిబిజెఎ నాయకులు వీసం శ్రీనివాస్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

