వైఎస్సార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే
1 min read– టిడిపి పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అత్తార్ జాహీద్ హుస్సైన్ టిడిపి పార్టీ కి షాక్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణానికి చెందిన టిడిపి పార్టీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తార్ జాహీద్ హుస్సైన్ టిడిపి పార్టీ సభ్యత్వానికి ,పదవికి రాజీనామా చేసి బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి సమక్షం లో వైఎస్సార్ పార్టీ లో చేరారు . ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు అత్తార్ జాహీద్ హుస్సైన్ ఆయన తమ్ముడు అత్తార్ అఖిల్ కు వైఎస్సార్ పార్టీ కండువ కప్పి వైఎస్సార్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు .అనంతరం అత్తార్ జాహీద్ హుస్సైన్ తన ఇంటికి సాదరం గా ఆహ్వానించి వారి కుటుంబ సభ్యులు ,బంధు మిత్రులను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు వైఎస్సార్ పార్టీ కండువ కప్పి వైఎస్సార్ పార్టీ లోకి ఆహ్వానించారు . అనంతరం శాలువా కప్పి గజ మాలతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి ,వైఎస్సార్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజు టిడిపి పార్టీ ని వీడి వైఎస్సార్ పార్టీ లో చేరిన అత్తార్ జాహీద్ హుస్సైన్ కు ముందుగా స్వాగతం పలుకుతూ వైఎస్సార్ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తాం అని అలాగే అత్తార్ జాహీద్ హుస్సైన్ కు తన నాన్న గారి గుండెల్లో స్థానాన్ని కల్పిస్తాను అని కాబట్టి 2024 ఎన్నికల్లో బాగా కష్ట పది తన నాన్న గారిని అత్యాదిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు .ఈ సందర్భంగా అత్తార్ జాహీద్ హుస్సైన్ మాట్లాడుతు తాను బీసీ జనార్ధన్ రెడ్డి గారికి 2014 మరియు 2019 ఎన్నికల్లో బాగా కష్ట పడి పని చేయడం జరిగినది అని అయితే బీసీ జనార్ధన్ రెడ్డి కి మాత్రం నిలివెట్టు అనుమానం వుందని చెప్పారు . తాను క్రికెట్ ప్రియున్ని అని క్రికెట్ అడి ఆర్గనైజర్ లతో ఫోటో దిగితే బీసీ ఎంతో రాద్దాంతం చేయడం జరిగినది అని అంతే కాకుండా తనను అనుమానించడం జరిగినది అని అందుకే అనుమానం ,అవమానం ఉన్న చోట మాత్రం తాను ఇమడ లేక పోయాను అని బీసీ జనార్ధన్ రెడ్డి కి నేను ఒకటే విన్నపించుకొంటున్నాను అని టిడిపి పార్టీ నాయకుల ,కార్యకర్తల మీద అనుమానం పెట్టుకోవద్దు అని బీసీ కి హితవు పలికారు . నేను ఎంటొ బీసీ జనార్ధన్ రెడ్డి కి 2024 ఎన్నికల్లో రుచి చూపిస్తాను అని చెప్పారు . అలాగే బీసీ బంధువులు ఎవరు కూడా సాహసం చేసి వైఎస్సార్ పార్టీ నాయకులు ,పార్టీ మీద మాట్లాడలేక పోయారు అని నేను ధైర్యం తో మాట్లాడడం జరిగినది అని చెప్పారు . నేను కాటసాని రామిరెడ్డి గారి మీద నమ్మకం తోనే ఈ రోజు వైఎస్సార్ పార్టీ లో చేరడం జరిగినది అని చెప్పారు ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ నిన్నటి వరకు బీసీ జనార్ధన్ రెడ్డి కి వెన్నంటి వుండి ఈ రోజు బీసీ జనార్ధన్ రెడ్డి అనుమానం అనే విషపు వృక్షం నుంచి బయటకు వచ్చిన అత్తార్ జాహీద్ హుస్సైన్ నేడు వైఎస్సార్ పార్టీ లో చేరడం జరిగినది అని చెప్పారు . పార్టీ లో చేరిన అత్తార్ జాహీద్ హుస్సైన్ కు సముచిత స్థానాన్ని కల్పిస్తాను అని హామీ ఇచ్చారు. నియోజకవర్గం లో ప్రజలకు మంచి చేయాలని తాను ముందుకు వెళుతుంటే మంచి చేస్తే కాటసాని రామిరెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ప్రతి విషయం లో కూడా బిసి జనార్ధన్ రెడ్డి కోర్టులకు వెళ్ళి అడ్డుపడడం జరుగుతుంది అని బనగానపల్లె పట్టణం లో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే చూసి ఓర్వలేని బీసీ జనార్ధన్ రెడ్డి కోర్టు కు వెళ్ళి పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలు రాకుండా చేయడం జరిగినది అని అయితే దేవుని దయ ,ప్రజల ఆశీర్వాదం ,సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో త్వరలోనే పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాం అని చెప్పారు . అలాగే కొలిమిగుండ్ల మండలం లో పేదలకు భూపంపిణీ కార్యక్రమం చేపడితే ఎక్కడ పేదలు బాగపడుతారో అని కుల్లు ,కుతంత్రం తో కోర్టు కు వెళ్ళి అడ్డుపడడం జరిగినది అని అయితే రాబోయే రోజుల్లో బీసీ జనార్ధన్ రెడ్డి కి ప్రజలు బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తుంది అని చెప్పారు . 2024 ఎన్నికల్లో అందరూ కష్ట పడాలి అని మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిచేది నేనే అని అలాగే ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పారు.ఈ కార్యక్రమం లో అవుకు మండల వైఎస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ,సిద్దం రెడ్డి రామ్ మోహన్ రెడ్డి ,డాక్టర్ మహమ్మద్ హుస్సైన్ ,అబ్దుల్ ఖైర్ ,అబ్దుల్ ఫైజ్ ,ఎల్లయ్య,నీలి శ్రీనివాసులు,జీటీ వెంకటరామిరెడ్డి,సైకిల్ షాప్ మహబూబ్ వలి,కుమార్, రమణ,గౌండ మహబూబ్ బాష,కిషోర్,సురేష్,ప్రసాద్, ఖానిక్,షరీఫ్, ఆల్తాఫ్, గౌండ కంబగిరి, గౌండ సుబ్బయ్య,అనిల్,కుమ్మరిసురేశ్, అలిసెన్, కాటసాని ఓబుల్ రెడ్డి యూత్ , బనగానపల్లె పట్టణ వైఎస్సార్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.