NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అత్యంత వైభవంగా  శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవం

1 min read

ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు తూర్పు వీధిలోని శ్రీరామాలయం శివయ్య గుడి నందు సకల లోకాదీశులు పరంజ్యోతి స్వరూపులైన శ్రీ శ్రీమాన్ కల్కి భగవాన్ కి, పరమ ప్రేమ ప్రదాత అయిన జగన్మాత కల్కి భగవతి శ్రీ పద్మావతి దేవి అమ్మవారికి లోక కళ్యాణార్థమై దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మ భగవాన్ కళ్యాణాన్ని నిర్వహిస్తున్న కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.‌ అనంతరం అప్పలనాయుడు చేతుల మీదుగా పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author