కూటమి అభ్యర్థిని గెలిపించే బాధ్యత పట్టభద్రులపై ఉంది
1 min read
అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలవాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ని గెలిపించండి
ఏలూరు నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు ఆచంట సునీత,ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు
అత్యధిక మెజార్టీ సాదినే లక్ష్యంగా,ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థుల ప్రచార పర్వం
పల్లెవెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి: అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలవాలంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులందరిపై ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు పిలుపునిచ్చారు. గెలుపుమార్గాలను సునాయాసం చేసుకుంటూ,,, అత్యధిక మెజార్టీ సాధనే లక్ష్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారపర్వం జోరందుకుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రచారం ద్వారా పట్టభద్రులకు వివరిస్తూ,, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు మార్గం సుగమం చేస్తూ వస్తున్నారు. ఇదేక్రమంలో తాజాగా మంగళవారం కూడా ఏలూరులో ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయాల ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగ, సిబ్బందికి సమావేశం నిర్వహించగా,,, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు పాల్గొన్నారు. పట్టభద్రులకు కూటమి అభ్యర్ధి తరపున పాంప్లేట్స్ పంచి, మొదటి ప్రాధాన్యతా ఓటును వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 8 నెలల కాలంలోనే సామాన్యుల చెంతకు అనేక పథకాల లబ్దిని చేర్చిన ఘనతను సొంతం చేసుకుందన్నారు. ప్రతిఒక్కరికీ న్యాయం చేయాలనే తలంపుతో సుస్థిరపాలనకు కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని ఆయన కోరారు. పరిశీలకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ మేధావివర్గాల జాబితాలో నిలిచే వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా కూటమి అభ్యర్ధికి విద్యావంతులు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు షేక్ మీరావలీ, కో – ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
