నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రగతి కోచింగ్ సెంటర్ ని సిజ్ చేయాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/20-5.jpg?fit=550%2C369&ssl=1)
ఆర్ పి ఎస్ ఎఫ్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో నిరుద్యోగులు ను మోసం చేసి లక్షలు దోచుకుంటున్న ప్రగతి కోచింగ్ సెంటర్ని సిజ్ చేయాలి రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రగతి కోచింగ్ సెంటర్ లో డి ఎస్సి పేరిట గత సంవత్సరం నుండి తరగతులు నిర్వస్తున్నారు ని కానీ నిరుద్యోగులుకు కేవలం ఆరు నెలలు చెప్పి ఇప్పుడు సంవత్సరం కావూస్తున్న ఇంకా తరగతులు నడుపుతున్నారు, నిరుద్యోగులు లో చాలా మంది నిరుపేద కుటుంబంలనుంచి వచ్చినా వారు కాబట్టి అధిక ఫీజులు కట్ట లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోచింగ్ సెంటర్ నిరుద్యోగులు నుంచి ఈ సంవత్సరం దాదాపు ఇరువై లక్షలు వరకు వసూలు చేసింది, అయినా కూడా మహిళలు కు సరైన మౌలిక వసుతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కోచింగ్ సెంటర్ ని ఒక రేకులు షెడ్లో నిర్విస్తూ ఒక్క ఒక్క నిరుద్యోగి నుంచి పది వేలు నుంచి ఇరువై వేలు వసూలు చేస్తున్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ మరియు విద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికి అయినా జిల్లా అధికారులు స్పందించి ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పై చర్యలు తీసుకొని కోచింగ్ సెంటర్ ని సిజ్ చేయాలి డిమాండ్ చేశారు.లేనిపక్షంలో తరగతులు ని అడ్డుకుంటాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో అప్సర్,వసంత్, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.