NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ పట్టణంలో ఘనంగా బడి పిలుస్తోంది కార్యక్రమం

1 min read

బడి బయట పిల్లలను బడిలో చేర్పించండి    తల్లిదండ్రులకు జిల్లా విద్యాధికారి ఎల్ సుధాకర్  పిలుపు

న్యూస్ నేడు, పత్తికొండ : వాడి బయట పిల్లలను తల్లిదండ్రులు బాధ్యతలతో బడిలో చేర్పించాలని జిల్లా విద్యాధికారి  ఎల్. సుధాకర్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బడి బయట ఉన్న పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం మరియు ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బాలబాలికను ఒకటవ తరగతిలో నమోదు చేయడం లక్ష్యంగా మే 1వ తేదీ నుండి ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు  కర్నూలుజిల్లా విద్యాశాఖ అధికారీ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ L. సుధాకర్ , “బడి పిలుస్తుంది” కోఆర్డినేటర్ శ్రీ సురేంద్ర బాపూజి , ఎంపీడీఓ శ్రీమతి కవిత , మండల విద్యాశాఖ అధికారి శ్రీ రమేష్  ఆధ్వర్యంలో బుధవారం పత్తికొండ పట్టణంలో “బడి పిలుస్తోంది” కార్యక్రమం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద జరిగిన ర్యాలీలో అధికారులు మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో బడి ఈడు పిల్లల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా ఉందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలో మొత్తం 2,81,000 మంది విద్యార్థులను నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే UDISE Plus లో 2,35,000 మంది నమోదు కావడం ఆనందకర విషయమన్నారు. మిగిలిన 46,000 మంది విద్యార్థుల నమోదు కూడా పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేసి, ప్రతి విద్యార్థి UDISEలో నమోదయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రత్యేకంగా ఐదు సంవత్సరాలు నిండిన బాలబాలికల సంఖ్య జిల్లాలో 39,000 ఉందని, రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఇంత అధిక సంఖ్య లేదని పేర్కొన్నారు. వీరిలో కనీసం 21.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *