సమాజ అభ్యున్నతిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం
1 min read
అర్హులైన దెందులూరు నియోజకవర్గ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఉచితంగా ఇంటి స్థలం ఇస్తా
నా కుటుంబ సభ్యులతో పాటే మీ కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తా
జర్నలిస్ట్స్ యూనియన్ సభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాజ అభ్యున్నతిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, వ్యవస్థలో జరిగే తప్పులను నిష్పక్షపాతంగా ఎత్తిచూపటమే అసలైన జర్నలిజం అని,జర్నలిస్టుల కుటుంబాలను సైతం తమ సొంత కుటుంబ సభ్యులుగా వారి సంక్షేమానికి అండగా నిలుస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీ యు డబ్ల్యూజే ) దెందులూరు నియోజకవర్గ స్థాయి సమావేశం సోమవారం ఉదయం పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో జరిగింది. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలలోనీ వర్కింగ్ జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.కార్యక్రమంలో ముందుగా సుదీర్ఘకాలంగా జర్నలిజంలో సేవలు అందించి, ఇటీవల కాలంలో అసువులు బాసిన జర్నలిస్టు మిత్రుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు.పెదవేగి మండలం ఆంధ్రజ్యోతి పత్రిక సీనియర్ రిపోర్టర్ తాతా సూరిబాబు అధ్యక్షులుగా ఏర్పడిన దెందులూరు నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే నూతన కమిటీకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు. అనంతరం కార్యక్రమం ముఖ్య అతిథి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో శాలువాలు, పుష్పగుచ్చలు అందించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులను నూతన కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ” వ్యక్తిగత విద్వేషాల వల్ల, రాజకీయ ప్రలోభాల వల్ల, ఉదేశపూర్వకంగా కొంత అవమానకరంగా ఉండేలా వ్యక్తిగత హననం లక్ష్యంగా చేసుకుని కొందరు జర్నలిస్టులు రాతలు రాయడం వల్ల సమాజంలో కొన్ని అనవసర అవాంతరాలు, సమస్యలు వస్తున్నాయి అని అన్నారు. ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులతో తనకి దాదాపు 30 సంవత్సరాలుగా పరిచయం ఉంది అని, అయితే ఇన్ని ఏళ్ల పరిచయ కాలంలో ఏనాడు మరొక వ్యక్తిపై చెడు వార్తలు రాయమని నేను ఎవరిని కోరలేదని, తనపై ఏదైనా తప్పుడు వార్తలు వస్తే వాటిపై వివరణ కోరతానే తప్ప, ఎదుటి వ్యక్తులపై తప్పుడు రాతలు రాయమని, చెడు రాతలు రాయమని ఏ రోజు ఎవరిని అడగలేదని, ఇక ముందు కూడా అడగబోనని కూడా స్పష్టం చేశారు.. అదేవిధంగా వ్యవస్థలో జరిగే లోపాలు రాయవద్దు అని తాము ఎవరికి కూడా ఆక్షేపణలు చెప్పమని, వ్యవస్థలో జరిగే తప్పిదాలను నిష్పక్షపాతంగా ఎత్తి చూపటమే జర్నలిజమని, మంచి ఉంటే మంచి అని, చెడు ఉంటే చెడు అని బయటకు తీసుకు రావడంలో జర్నలిజం పాత్ర వెలకట్టలేనిదని, అటువంటి నిష్పక్షపాత నిస్వార్థ విధానాలను అవలంబించే ప్రతి జర్నలిస్టును తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని తెలిపారు.. అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని జర్నలిస్టు మిత్రులు తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడం కి కృషి చేస్తానని తెలిపారుఈ కార్యక్రమంలో విజయరాయి సొసైటీ చైర్మన్ బొప్పన సుధా, పెదవేగి సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ తాతా శ్రీ రామ్ మూర్తి,సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు,నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.

