NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విభిన్నప్రతిభావంతునికి ఈ – ట్రై సైకిల్ అందచేసిన ఎమ్మెల్యే

1 min read

ఎమ్మెల్యే కి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేసిన పరసా మంగయ్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్ అందించడంతో పాటు వారి సంక్షేమానికి సైతం కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలిపారు.దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిశీలించి,తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన పరశా మంగయ్య అనే విభిన్న ప్రతిభావంతునికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  e- ట్రై సైకిల్ ను అందచేశారు.ఈ సందర్భంగా తనపై ఎంతో ఆప్యాయత చూపిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి పరాసా మంగయ్య ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపారు.

About Author