మర్రపు సత్యనారాయణ,వక్కినేని సేవలు అభినందనీయం
1 min read
సిపిఐ నిర్మాణానికి ఎనలేని కృషి చేసిన మహనీయులు
వారి ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
ఆర్టీసీ పలు సంఘాల ఎంప్లాయిస్ నాయకులు ఘన నివాళులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లాలో ఆర్టీసీలో కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అభివృద్ధికి, ఏఐటీయూసీ అభివృద్ధికి తద్వారా సిపిఐ నిర్మాణానికి కృషిచేసిన మహనీయులు మర్రాపు సత్యనారాయణ, వంకినేని శ్రీశైల మల్లికార్జునుడు ల ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఏలూరు కొత్తపేట ఫ్రెండ్స్ సర్కిల్ సెంటర్లో గురువారం ఉదయం మర్రాపు సత్యనారాయణ, వంకినేని మల్లికార్జునుడుల వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐటియుసి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షత వహించారు. మర్రాపు స్మారక స్థూపానికి బండి వెంకటేశ్వరరావు పూలదండ వేసి నివాళులర్పించారు. మర్రాపు చిత్రపటానికి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ చైర్మన్ రాఘవులు, మర్రాపు తనయుడు జగదీశ్వరరావు పూలమాలలు వేయగా వంకినేని చిత్రపటానికి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి బి రాంబాబు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఎఐటియుసి, సిపిఐ నిర్మాణానికి మరియు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మర్రాపు, వంకినేని ఆశయాలను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి బి రాంబాబు, ఏలూరు డిపో గౌరవ అధ్యక్షులు వై శ్రీనివాస్, ఎంప్లాయిస్ యూనియన్ మాజీ నాయకులు ఎస్ సంజీవరావు, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు,ఏఐటీయూసీ నాయకులు కడుపు కన్నయ్య మాట్లాడుతూ మర్రాపు సత్యనారాయణ, వంకినేని మల్లికార్జునుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మర్రాపు జగదీశ్వరరావు ఆర్టిసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శనివారపేట బివి రావు, ఎస్ ధనంజయ, బట్టా మాణిక్యాలరావు, ఏఐటీయూసీ నాయకులు పుప్పాల శ్రీనివాసరావు బివి సుబ్రహ్మణ్యేశ్వర రావు, రెడ్డి నాగేశ్వరరావు సిపిఐ నాయకులు చింతల సూర్యనారాయణ, గేదెల నాగేశ్వరరావు, కొత్తల రాము, కనకం జగన్ బుగ్గల ప్రభాకర్ రావు, అరిగెల యోహాన్ , రౌతు వెంకటేశ్వరరావు, అల్లు త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు.