విద్యార్థి దశలోనే సేవాభావం పెంపొందించుకోవాలి
1 min read
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హెచ్.యం. భ్రమరాంబ
పత్తికొండ, న్యూస్ నేడు: విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకోవాలని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ సూచించారు. గురువారం స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయు రాలు భ్రమరాంబ ఆధ్వర్యంలో “స్కౌట్స్ అండ్ గైడ్స్ “ప్రారంభ సమావేశం జరిగింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలు శాంతి సుధా, నాగశీల శారద ఆరవ తరగతి చదువుతున్న 24 మంది విద్యార్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ బాల బాట ఉద్యమం (స్కౌట్స్ అండ్ గైడ్స్ మూవ్ మెంట్) లో శిక్షణ తీసుకున్నట్లయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవా భావం ,దేశభక్తి పెంపొంది సమాజ సేవకులుగా ఎదుగుతారని ఆమె అన్నారు.బాలుర కోసం స్కౌట్స్ ఉద్యమం, బాలికల కోసమే గైడ్స్ ఉద్యమమని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు రుక్మిణి పాల్గొనడం జరిగింది.
