రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టి ద్వారా 8 వేల కోట్ల రూ. ప్రతి ఏటా నష్టం
1 min read

ప్రజలకు 8 వేల కోట్ల రూపాయలు ప్రయోజనం ప్రజా ప్రభుత్వం కోరుకున్నది ఇదే
ప్రతి కుటుంబానికి నెలకు రూ 3 వేలు నుండి రూ 10 వేలు రూపాయలు వరకు ఆదా
సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ ద్వారా రైతులకు మరింత లాభసాటి వ్యవసాయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తూ రైతులకు, ప్రజలకు కొండంత అండగా నిలిచాయి
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సుమారు 70 ట్రాక్టర్లు ర్యాలీలో స్వయంగా ట్రాక్టరు నడిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అదే ట్రాక్టరుపై కూర్చుని రైతులకు, ప్రజలకు అవగాహన, స్ఫూర్తిని కలిగించారు. ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం – బుడ్డగూడెం కాలనీ నుండి బుధవారం జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సుమారు 70 ట్రాక్టర్లు ర్యాలీ ప్రారంభించి, స్వయంగా ట్రాక్టరు నడిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అదే ట్రాక్టరుపై కూర్చుని రైతులకు, ప్రజలకు అవగాహన, స్ఫూర్తిని కలిగించారు. ఈ ర్యాలీ గ్రామ సచివాలయం వరకు చేరింది. అనంతరం సచివాలయం వద్ద జిఎస్టి తగ్గింపుతో కలిగే ప్రయోజనాలపై ట్రాక్టర్లు, వ్యవసాయ వివిధ రకాలు పరికరాలు, ఫోటో ఎగ్జిబిషన్ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పరిశీలించి, రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. దేశం, రాష్ట్రం ప్రయోజనాలు కోసం నిరంతరం ఆలోచన చేస్తూ, మంచి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలను ఆదరించి, ఆశీస్సులు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ తో రైతులు, ప్రజలు కొనుగోలు చేసిన వస్తువుల్లో ధరలు తగ్గి కుటుంబానికి మరికొంత ఆదాయం పెరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టం వాటిల్లుతున్నప్పటికీ, ప్రజలకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు 3 వేల నుండి 10 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని ఇది శుభపరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ జెడి షేక్ హబీబ్ భాషా, జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, యంపిడివో బి.భార్గవి, డిప్యూటీ తహశీల్దారు జి.పవన్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


