NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల సంక్షేమం…రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ దేయం

1 min read

విద్యార్థుల గళం దేశ గళంగా మారింది – ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ స్వాగతం

రాష్ట్ర ఓబిసి కాంగ్రెస్ చైర్మన్ సొంటి నాగరాజు

కర్నూలు, న్యూస్​ నేడు:  ఓబీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం, విద్యార్థుల సంక్షేమం మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ దేయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ సొంటి నాగరాజు అభిప్రాయపడ్డారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల ఓబీసీ కాంగ్రెస్ సమీక్ష జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ డివి సాంబశివుడు ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు న్యాయవాది బోయ క్రాంతి నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన సొంటి నాగరాజు మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్నూలు జిల్లాలో బీసీలు, విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ మాట్లాడుతూ, “విద్యార్థులపై లాఠీలు కాదు… న్యాయం కావాలి.కార్యక్రమ అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామ చేయడంతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బాణా సంచా పేల్చి కొండా రెడ్డి బురుజు వరకు విజయోత్సవ ర్యాలీ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, గౌరవ సలహాదారు సీనియర్ నాయకులు ఉండవెల్లి వెంకటన్న, నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఎం కాసిం వల్లి, అనంతరత్నం మాదిగ, ఐఎన్టియుసి ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ ఖాద్రి బాషా, ఐఎన్టియుసి జిల్లా చైర్మన్ అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్ సి బజారన్న, ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ వై మారుతీ రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి, ఓబిసి జిల్లా మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్, ఎస్సీ సెల్ మాజీ జిల్లా చైర్మన్ ఈ లాజరస్, డిసిసి ఉపాధ్యక్షులు దిలీప్ ఢోకా, రియాజుద్దీన్, కోసిగి జిలాని, గోనెగండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముల్లా ఖాసీం వలి, రాజశేఖర్ ఆచారి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నస్వామి, ఐ ఎన్ టి సి సి టి అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు అబ్దుల్ హై అధిక సంఖ్యలో మహిళలు మొదలగువారు పాల్గొన్నారు.

About Author