యువగలం పాదయాత్ర నేటితో మూడు సంవత్సరాలు పూర్తి
1 min read
యనమదల కుదురులో కేక్ కటింగ్
యనమలకుదురు, న్యూస్ నేడు : జగన్ రెడ్డి సైకో పాలనను అంతం చేసి, రాష్ట్ర యువత భవిష్యత్తుని అంతర్జాతీయ స్థాయిలో నిలిపి, తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన యువ గళం పాదయాత్రకి నేటితో మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యనమలకుదురులో రాష్ట్ర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టి,యువ గళం క్యాలెండర్ లు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ గత జగన్ రెడ్డి సైకో పాలన లో ఆంధ్ర రాష్ట్ర సంపద దోపిడీకి గురైన సందర్భంలో, యువనాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువ గళం పాదయాత్రను (27.01.2023)న కుప్పం నుండి శ్రీకాకుళం వరకు చేపట్టిన రోజు అని,యువ గళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొంటూ, జగన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించిన వెనకడుగు వేయకుండా పాదయాత్రను విజయవంతం చేసి, అడుగడుగునా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ, ముఖ్యంగా యువతకు నేనున్నానన్న ధైర్యం చెప్పి సాగిన పాదయాత్ర 2024లో ప్రభుత్వ ఏర్పాటుకు దోహద పడిందని, ఈ పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ననలు లోకేష్ పొందారని అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, యువత లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకంతో, భవిష్యత్తు నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. యువ గళం పాదయాత్ర ద్వారా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 94% స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు కూటమికి రావటం, 151 సీట్లు ఉన్న వైసిపి పార్టీకి 11 సీట్లకే పరిమితం కావడం, కేవలం లోకేష్ నాయకత్వంలో జరిగిందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కి శొంఠి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంఘేపూ రంగారావు సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరస్వామి మాజీ గ్రామపంచాయతీక్షలు మొఖపాటి శ్రీనివాస్ మచికలపూడి బబ్లు మధు రమేష్ బలకం కొండ బుక్య రాజా రామాను యువరాజు కళ్యాణపు శ్రీనివాసరావు వెలగపూడి రామలింగయ్య కొత్తపల్లి పాపారావు కోసూరి రమేష్ పత్తిపాటి వెంకటేష్ బెజవాడ శివయ్య వీరంకి నంది చిరావూరి శేషు బొంగా బాల స్వామి ఎడ్లపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


