బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి
1 min read

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు..మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పునరావాసం పై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారి ఆదేశాల మేరకు జనవరి 26 వ తేది నుండి మార్చి 31 వ తేదీ వరకు చైల్డ్ లేబర్ డ్రైవ్ నిర్వహించి, బాల కార్మికులను గుర్తించి పునరావాసం కేంద్రాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ అధికారులు వారానికి ఎన్ని తనిఖీలు చేశారనే ఫోటోలు, వివరాలను డేట్ మరియు టైమ్ స్టాంప్తో సహా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారికి సమర్పించాలని కలెక్టర్ కార్మిక శాఖ అధికారిని ఆదేశించారు. కార్మిక సిబ్బంది పనితీరు సరిగ్గా ఉండాలని, ఏదైనా తేడా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కార్మిక శాఖ అధికారిని హెచ్చరించారు.సమావేశంలో కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ పిడి విజయ, డిఈఓ సుధాకర్, సాంఘిక సంక్షేమ అధికారి రాధిక, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ జుబేదాబేగం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, తదితరులు పాల్గొన్నారు.

