NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కిషన్ గార్డెన్‌పై ఎస్‌హెచ్‌జీ సభ్యులకు శిక్షణ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:  ప్యాపిలి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కిషన్ గార్డెన్‌పై స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని 32 పంచాయతీల నుంచి ప్రతి పంచాయతీకి ఇద్దరు చొప్పున పొదుపు మహిళలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు, వెలుగు సీసీ హెచ్‌.సి. రంగడు మాట్లాడుతూ కిషన్ గార్డెన్‌లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి పంటలను పండించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, వృథాగా వెళ్లే నీటిని పంటల సాగుకు వినియోగించుకోవాలని తెలిపారు. ఇంటివద్దనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం ద్వారా కుటుంబ అవసరాలు తీరడంతో పాటు, మార్కెట్‌లో కూరగాయల కొనుగోలుకు అయ్యే ఖర్చు తగ్గి కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని వివరించారు. కిషన్ గార్డెన్ నిర్వహణ, అమలు విధానం తదితర అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.శిక్షణలో పొందిన విషయాలను ఆచరణలో పెట్టి కిషన్ గార్డెన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.కార్యక్రమంలో వివిధ పంచాయతీలకు చెందిన పొదుపు మహిళలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *