వీరారెడ్డి మృతదేహానికి ఘనంగా పూలమాలవేసి నివాళులు
1 min read

నివాళులు అర్పించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్ర గౌడ్
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరా రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ విషయాన్ని తెలుసుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్ర గౌడ్ మల్కాపురం గ్రామానికి వెళ్లి వీరారెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని విధాలుగా అండదండలు ఉంటుంది అని వారి కుటుంబానికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిరెడ్డి,మల్కాపురం సర్పంచ్ దేవేంద్ర రెడ్డి, పెద్దయ్య,నరసింహులు, ఎంపిటిసి హనుమంతు,డిష్ రఫీ,బాపురం ఇంద్రసేనారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

