తెర్నేకల్లులో మంగళవారం నుండి తి.తి.దే ధార్మిక కార్యక్రమాలు
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
కర్నూలు, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు (తితిదే) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్న మాధవస్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో ఇస్కాన్ ధర్మ ప్రచారకులు శ్రీ నిత్యతృప్తదాసు స్వామిచే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే ప్రతిరోజు భజనలు, శుక్రవారం గోపూజ మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ధార్మిక చైతన్యం, భక్తిభావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంచే ఆవిష్కరింపచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.



