జీజీహెచ్‌కు రెండు రాష్ట్రస్థాయి అవార్డులు…
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఉత్తమ సేవలు అందించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏట డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అందజేసిన రాష్ట్రస్థాయి అవార్డులు కర్నూల్ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి రెండింటికీ రెండు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి అని తెలియజేశారు.ఉత్తమ అవార్డుగా ఐసీటీసీ ఓపీ:39 (ICTC) మరియు స్టేట్ రిఫరెన్స్ లేబరేటరీ (SLR) మైక్రో బయాలజీ విభాగాలలో రెండు రాష్ట్రస్థాయి అవార్డులు కర్నూల్ మెడికల్ కాలేజ్ మరియు కర్నూల్ సర్వజన వైద్యశాలలకు అవార్డులు లభించడం శుభ పరిణామం అని తెలియజేశారు.ఐసీటీసీ ఓపీ:39 (ICTC) మరియు స్టేట్ రిఫరెన్స్ లేబరేటరీ (SLR) మైక్రో బయాలజీ విభాగాల సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్రస్థాయి అవార్డులను ఈరోజు రెండు విభాగాల సిబ్బందికి అందించినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, CSRMO డా.వెంకటేశ్వరరావు, మైక్రో బయాలజీ విభాగపు అధిపతి, డా.రేణుకాదేవి, ఐసీటీసీ మెడికల్ ఆఫీసర్, డా.శిరీష మరియు డా.హరిత, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.