అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఆకస్మిక తనిఖీ
1 min read
కర్నూలు న్యూస్ నేడు: జిల్లా వైద్యమరియు ఆరోగ్యశాఖాధికారి ఆదేశాలమేరకు జిల్లా సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారిడాక్టర్.రఘ కర్నూల్ నగరంలోని భగీరథి,డాక్టర్.అబ్రాహిం లింకన్ స్కానింగ్ సెంటర్,సుఖీభవ విజయ కేర్ హాస్పిటల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్ట్రేషన్,రెన్యువల్ కు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించినారు, అనంతరం స్కానింగ్ సెంటర్లలో మిషన్లు రిజిస్టర్ లో నమోదు, వాటి వరుస సంఖ్య, తయారీ కంపెనీ ల పేర్లను సరిపోల్చి చూశారు,వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా స్కానింగ్ నిర్వహిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు, స్కానింగ్ సెంటర్ల తనిఖీలో భాగంగా లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరమని తెలిపారు,స్కానింగ్ చేసే ప్రతి గర్భిణీ యొక్క వివరాలను ఫారం ఎఫ్ లో ఇంటి పేరుతో రాయాలని ,మొదటి కాన్పు ,రెండవ కాన్పు ఆడ,మగ ,వయస్సు, రాయాలని అన్నారు. ఫారం ఎఫ్ లు ప్రతి నెల 5 వ తేదీ లోపు ఆన్ లైన్ లో పొందుపరచాలని తెలిపారు,, పిసిపిఎన్‌డిటి యాక్ట కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని,ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారు. కాలపరిమితి లోపల రెన్యూవల్ చేయించాలని తెలిపారుఆసుపత్రిలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమనే పోస్టర్ లను కనిపించేలా ప్రదర్శించాలని తెలిపారు.ఈ కార్యక్రమములో సంబంధిత ప్రైవేటు నర్సింగ్ హోం యజమానులు మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.