NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంట నీటి కుంటల నిర్మాణాలను చేపట్టండి

1 min read

ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయండి

లబ్ధిదారులకు పోసేషన్ సర్టిఫికెట్స్ అందజేయండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన 2500 పంట నీటి కుంటల నిర్మాణ పనులకు రైతులను ప్రోత్సహించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఎంపిడిఓ, ఎపిడీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం ఉపాధి హామీ, ఇళ్ల నిర్మాణాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య, హౌసింగ్ పిడి హరిహర గోపాల్, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 2500 పంట నీటి కుంటల నిర్మాణ పనులకు రైతులను ప్రోత్సహించి ప్రారంభం కాని నీటి కుంటలను గురువారం లోపు పూర్తి చేయాలని ఎంపిడిఓ, ఎపిడిలను కలెక్టర్ ఆదేశించారు.పంట  నీటి కుంట్ల చుట్టూ కూరగాయల పెంపకం, క్యాటిల్ షెడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున…ఇన్లెట్, ఔట్లెట్ సరైన దిశలో ఉండే విధంగా టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ సలహా మేరకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంట నీటి కుంటల నిర్మాణాల వల్ల లేబర్ బడ్జెట్ పెరిగి ఉపాధి వేతన దినసరి సరాసరి రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లో ఫారం ఫాండ్స్ నిర్మాణాలకు అవకాశాలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అలాగే నిర్మించిన పశువుల నీటి తొట్లలో ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హౌసింగ్, ఎంపిడిఓలను కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు 26,276 పోసిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 8722 పంపిణీ చేయడం జరిగిందని ఇంకా పెండింగ్ లో వున్న 17,440 పోసిషన్ సర్టిఫికెట్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ, తాసిల్దార్లను ఆదేశించారు.ఎలెక్ట్రోల్ రేషియో శాతం, ఫార్మ్స్ 6, 7, 8 దరఖాస్తులు, ఓటరు చనిపోతే ఏం చేయాలి ? ఓటరు షిఫ్టింగ్ అయితే ఏం చేయాలి ? ప్రాస్పెక్టివ్ ఓటర్ అంటే ఏంటి ? పిఎస్సీ, డిఎస్సీ అంటే ఏంటి అనే అంశాలపై బిఎల్ఓలకు తెలిసి ఉండాలన్నారు. అదే విధంగా బిఎల్ఓ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. బిఎల్ఓలు, బిఎల్ఎ, బిఎల్ఎ సూపర్వైజర్లు కూడా హాజరు కావాలన్నారు. అదే విధంగా బిఎల్ఓలు ఎన్నికల అంశాలపై పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఈఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *