ఐక్య మత్యం తో వగరూరు చెరువుకు గండం తప్పింది
1 min read
రేయింబవళ్లు కష్ట పడి గండిని పూడ్చిన గ్రామస్తులు, రైతులు
రెండు రోజులుగా కంటి నిండా కునుకు లేకుండా గడిపిన గ్రామస్తులు, రైతులు
ఊపిరి పీల్చుకున్న రైతులు, గ్రామస్తులు
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని వగరూరు సమీపంలో నిర్మించిన సూగురు రిజర్వాయర్ కు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ గా వరద నీరు చేరడంతో చెరువుకు గండ్లు పడ్డాయి. దీంతో రైతులు, గ్రామస్తులు నాయకులు కు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులను, రెవిన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని రైతులు, గ్రామస్తులతో కలిసి ఐక్య మత్యం తో మూడు రోజులు గా రెండు ఇటాచిలు, పది ట్రాక్టర్ల తో రేయింబవళ్లు కష్ట పడి చెరువు కు పడిన గుండ్లను మంగళవారం పూడ్చారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయం తో కాలం గడిపారు. దీంతో చెరువు కింద ఉన్న గ్రామాల ప్రజలు రైతులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు రోజులు గా కంటి నిండా కునుకు లేకుండా భయం తో గడిపారు. గండ్లు పూడ్చడం తో ఊపిరిపీల్చుకున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఐక్య మత్యం తో మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి, తిక్కారెడ్డి ఆదేశాల తో టిడిపి నాయకులు వగరూరు అబ్దుల్, నాయకులు, పవన్ కుమార్ రెడ్డి, గోపాల్ , లింగప్ప, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల తో వైకాపా జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, షాకీర్ సాబ్, మిగతా నాయకులు కలిసి కష్ట పడి చెరువు కు గండం తప్పించారు.
అధికారుల పర్యవేక్షణ కరువు : – సూగురు రిజర్వాయర్ కు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ కరువైంది. చెరువు కట్ట కు ఇరువైపుల ముళ్ల కంప చెట్లు పెరగడంతో గండ్లు పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేసే విధంగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

