పలు దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు
1 min read

తూనికల కొలతల చట్టంపై తొమ్మిది కేసులు నమోదు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలోని ఆర్ఆర్ పేట శ్రీనివాస థియేటర్ సందులో ఎమ్మార్పీలు లేకుండా సెల్ఫోన్ ఉపకరణాలు అమ్ముతున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, తూనికల కొలతల అధికారులు సంయుక్తంగా బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో హిందుస్థాన్ మొబైల్స్ భవాని మొబైల్స్ దుకాణాలపై తూనికలు కొలతలు చట్టం ప్రకారం 9 కేసులు నమోదు చేశారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సైలు రంజిత్ కుమార్, నాగరాజు సీతారాం, తూనికల కొలతల అధికారి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

