PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది మండలంలో…వాలంటీర్​ ఉద్యోగాలు..!

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (VSWS&D) ఆదేశాల మేరకు మహానంది మండపంలోని ఆరు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను భర్తీ నిమిత్తం స్థానిక ఎంపీడీవో శనివారం నోటిఫికేషన్ జారీ విడుదల చేశారు. మహానంది మండలంలోని మసీదుపురం-2పోస్టులు , తమ్మడపల్లి-1 , సీతారామపురం-1 , తిమ్మాపురం-3 , బుక్కాపురం-1 , నందిపల్లె-1చొప్పున మొత్తం 9 గ్రామ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈమేరకు ఆయా సచివాలయాల్లో నిర్ధశించిన రిజర్వేషన్ల ప్రకారం మసీదుపురం-2 (BC Female-1, SC Female-1), తమ్మడపల్లి-1 (BC Female-1), సీతారామపురం-1 (BC Male-1), తిమ్మాపురం-3 (BC Female-2, BC Male-1), బుక్కాపురం-1(BC Male-1), నందిపల్లె-1(SC Female-1) ఆయా కేటగిరులకు చెందిన అభ్యర్థులకు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మండల ఎంపీడీవో కోరారు.

About Author