NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పసుపల ‘‘రుద్రవరం’’ గ్రామంలో నీటి సమస్య

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ మండలం పసుపల రుద్రవరం గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో నీటి సమస్య తలెత్తుతుంది. నీటి సరఫరా చేసే 2 మోటార్లలో ఒక మోటర్ పాడవడంతో ఉన్న ఒక మోటర్ తో నీటిని సరఫరా చేస్తున్నారు. సచివాలయం సెక్రెటరీని ఈ సమస్యపై వివరణ అడగగా  గట్టు లో ఉన్న బోరులో నీళ్లు  పూర్తిగా   లేవు అందవల్ల నీటిని ట్యాంకుకు సరఫర చేయడం లేదు అని సమాధానం ప్రజలకు ఇచ్చారు.   అరకొరగా వచ్చే నీరు  ప్రజలకు సరిపోవడం లేదు, దీనిపై అధికారులు స్పందించి సమస్యను   పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే సమస్యను విలైనంత తొందరగా పరిష్కరించాలని కోరారు. ఈ నీటి  సమస్య పంచాయతీ ఎన్నికలపై పడే ప్రభావం ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *