తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
1 min read

ఏ ఒక్క రైతు ఆందోళన చెందవద్దు
ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వినియోగించాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నూజివీడు మండలం రామన్నగూడెంలో గురువారం దెబ్బతిన్న మినుము పంటలు, సీడ్ కాటన్ సాగు, తుక్కులూరులో డ్యామేజీ అయిన రామిలేరు బ్రిడ్జిని, తుక్కులూరు కమ్యూనిటీ భవనంలో పునరావాస కేంద్రంలో 5 మంది బాధిత కుటుంబాలకు 25 కేజీలు బియ్యం, నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ, మీర్జాపురంలో నేలకొరిగిన వరి పొలాలను సంబంధిత అధికారులు, రైతులు, గ్రామ ప్రజలుతో కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సుడిగాలి పర్యటనలు చేశారు. సీడ్ కాటన్ సాగు రైతులు ఏకరానికి మూడు లక్షలు రూపాయలు పెట్టుబడి పెడతామని, మాకు ఒక లక్ష రూపాయలు ఆదాయం లభిస్తుందని అయితే తుఫాన్ ప్రభావం వలన ఏకరాకు రూ 1లక్ష 50 వేలు నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టరుకు వివరించారు, మినుము పంట ఏకరాకు రూ 20 నుండి 25 వేలు పెట్టుబడి పెట్టామని అయితే తుఫాన్ వలన పంట మొత్తం నష్టం పోయామని రైతులు వివరించారు.వరి పంటలు 1061 వరిరకం పెట్టామని, ఏకరానికి రూ 30 నుండి రూ 40 వేలు పెట్టుబడి పెట్టామని బాగా పెరిగిందని, పది రోజుల్లో కోతకు వచ్చి 50 బస్తాలు దిగుబడి వస్తుందని అనుకున్నామని అయితే తుఫాన్ వలన ఏకరాకు 10 నుండి 20 బస్తాలు దిగుబడి తగ్గిపోతుందని, ఖర్చులు రెట్టింపు అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టరు వెంట సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, నూజివీడు మండలం ప్రత్యేక అధికారి, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు కె.సంతోష్, డియల్డివో పులఖoడ. వెంకటరత్నం, ఏడిఏ వై.సుబ్బారావు, తహశీల్దారు జి.బద్రు, యంపిడివో సి.రాఘవేంద్ర నాథ్, మండల ఉద్యానవన శాఖ అధికారి ఆర్.హేమ, మండల వ్యవసాయ శాఖ అధికారి పి.చెన్నైరావు, రెవిన్యూ, వివిధ శాఖలు, సచివాలయ ఉద్యోగులు, రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

