NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం మైనారిటీలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాలి – షేక్ బషీర్ అహ్మద్

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో ఒక స్థానాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి తెలుగుదేశంపార్టీ రాష్ట్ర మైనారిటి సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బషీర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం సమాజానికి చెందిన అభ్యర్థులకు ప్రాతినిధ్యం లభించలేదు. ఈ నేపథ్యంలో మైనారిటీలకు రాజ్యసభ ద్వారా అవకాశం కల్పించడం సముచితమైన నిర్ణయంగా ఉంటుంది. గతంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తూ లాల్‌జాన్ బాషా , సైఫుల్లా బేగ్  వంటి నాయకులను రాజ్యసభకు పంపిన చరిత్ర కలిగి ఉంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈసారి కూడా ముస్లిం సమాజానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాము.ఈ సందర్భంగా విద్యావంతుడు, పార్టీకి విధేయుడు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడు, శాసనమండలిలో అమరావతి రాజధాని పరిరక్షణ కోసం గట్టిగా పోరాడిన యోధుడు హాజీ మహ్మద్ అహ్మద్ షరీఫ్ ని రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.హాజీ మహ్మద్ అహ్మద్ షరీఫ్ కి అవకాశం కల్పించడం ద్వారా ముస్లిం మైనారిటీలకు సముచిత ప్రాతినిధ్యం లభించడమే కాకుండా, పార్టీ పట్ల విశ్వాసంతో పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

About Author