PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి ఇంటా సంక్షేమం :మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్

1 min read

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలో పూలు సమర్పించి నివాళులర్పించిన గుమ్మనూరు ఈశ్వర్

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అందచేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా సంక్షేమం, ఆనందంగా ఉన్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు యువనేత గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు.బుధవారం ఆస్పరి మండలంలోని ముత్తుకూరు గ్రామంలో  సచివాలయం పరిధిలో సంక్షేమ పథకాల  డిస్ ప్లే బోర్డులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి  ఆవిష్కరించారు. అనంతరం ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ నాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎటువంటి లోటు లేకుండా పాటిస్తున్నారని, 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్నే చేసుకుందామని అన్నారు. నాలుగు సంవత్సరాల్లోనే అభివృద్దిని సంక్షేమాన్ని చూపిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొననారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు మరియు మంత్రి గుమ్మనూరు జయరాం  నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనను 2024లో మళ్లీ శాసనసభ్యునిగా అత్యధిక మెజారిటితో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముత్తుకూరు సర్పంచ్ తోయాజక్షప్ప, ఆస్పరి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ ములింటి రాఘవేంద్ర, ఆస్పరి సొసైటీ సీఈవో అశోక్, వైస్ ఎంపీపీ రాజన్న గౌడ్, రెడ్డి,ఆస్పరి ఎంపీటీసీ తిమ్మప్ప,కౌలిట్ల, జీవన్ కుమార్,కృష్ణ రెడ్డి,నాయుడు, వేణు,విజయ్ కుమార్,మనోహర్ రెడ్డి , చంద్ర, ఎర్రి స్వామీ,ప్రభాకర్ యాదవ్, అలీ, రాజు,మేఘనాథ్, ఉసేని ,శ్రీరాములు, మల్లేష్, లక్షన్న ,శేఖర్ వైఎస్ఆర్సిపి నాయకులు, సచివాలయ కన్వీనర్లు,గృహసారుదులు, వాలంటీర్లు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author