కార్మికులు ఉద్యోగులు హక్కుల సాధన కోసం 12వ తేదీన కదిలి రావాలి
1 min read
సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ.చిన్న రహీమాన్
ప్యాపిలి న్యూస్ నేడు: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల ఫిబ్రవరి 12న నిర్వహించ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు జలదుర్గం పీహెచ్సీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ షేక్. కిషి వార్ సుల్తానా కి, ప్యాపిలి గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శివకుమార్ గౌడ్ కి అందించామని సిఐటియు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహి మాన్ , అధ్యక్షులు పో దొడ్డి. రామాంజనేయులు, ఉపాధ్యక్షులు రంగస్వామి అన్నారు. వారు మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రధానంగా ఈ క్రింది డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నట్లు వివరించారు. కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు నిర్ణయించాలని సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని సూచించారు. ప్రవిటీకరణ నిలిపివేత ప్రభుత్వ రంగ సంస్థల ప్రవటీకరణను తక్షణమే ఆపాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఆశా కార్యకర్తలు విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల హక్కుల రక్షణకు ఈ సమ్మె అత్యంత దోహద పడుతుందని పేర్కొన్నారు. సమ్మె విజయవంతానికి ప్రతి ఒక్కరూ హక్కుల సాధన కోసం కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 12 న జరిగే సమ్మెలో ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్మికులు, విఆర్ఎ లు, ఉద్యోగులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చెన్నయ్య, శ్రీనివాసులు, ఇలియాజ్, రవి, జాఫర్, గోవర్ధనగిరి చంటి తదితరులు పాల్గొన్నారు.

