NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ నాయకులు టైంపాస్ వేషాలు వేయొద్దు..

1 min read

వైఎస్ జగన్ పై మండిపడ్డ ఎంపీ శబరి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మండిపడ్డారు వైసీపీ నాయకులు టైంపాస్ వేషాలు వేయొద్దని అన్నారు.  మంగళవారం సాయంత్రం నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైసీపీ నాయకులపై ఎంపీ విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దని వైసీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.మెడికల్ విద్యార్థులపై మీకు అంత ప్రేమ ఉంటే మీ ప్రభుత్వ హయాంలో పులివెందులలో మెడికల్ ప్రభుత్వ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముందు మీరు ప్రైవేటేజేషన్ కు మరియు పీపీపీ అంటే ఏమిటో తెలుసుకోవాలని మెడికల్ కాలేజీలను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయుటకు ప్రైవేటు వారికి ప్రైవేటు పబ్లిక్ పార్ట్ నర్ షిప్ కింద ఇస్తుంటే వైసీపీ నాయకులకు చాలా కష్టమై పోతుందని అంటే వారికి పేద ప్రజలు అవసరం లేదా అని ప్రశ్నించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి మరియు నారా లోకేష్ 24 గంటల పాటు కష్టపడుతూ ఉన్నారని ఈనెల 16న జిల్లాకు ప్రధానమంత్రి వస్తున్నారని అన్నారు.పీపీపీ కింద వస్తే మంచి జరుగుతుందే కానీ నష్టం జరగదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు, కౌన్సిలర్ చాంద్ బాష మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author