మీ భూమి-మీ హక్కు కార్యక్రమం
1 min read

భాగంగా దెందులూరు మండలం మేదిన రావు పాలెం గ్రామంలో 680 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వాహస్తాలతో పాస్ పుస్తకాలు అందజేత
ఏలూరు, న్యూస్ నేడు: ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా “మీ భూమి – మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్నాం-ఎలాంటి దెయ్యం బొమ్మలు లేకుండా ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను సగర్వంగా అందిస్తున్నమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడిoచ్చారు.భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, రైతులకు పూర్తిస్థాయి భూ హక్కులను కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం దెందులూరు మండలం మేదినరావుపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం సిద్ధం చేసిన 680 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి స్థానిక ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు,అధికార యంత్రాంగం పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ” ఆధునిక సాంకేతికతతో రీ-సర్వే నిర్వహించి, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ తగాదాలను పరిష్కరించడం, రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి, తప్పులు లేని పాస్ పుస్తకాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, కొత్త పాస్ పుస్తకాల ద్వారా రైతులకు బ్యాంక్ రుణాలు పొందేందుకు మరియు భూ విక్రయ/కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని, రైతులకు తమ తాతలు , కుటుంబీకుల నుంచి వచ్చిన భూములపై గత వైసిపి ప్రభుత్వం లో దెయ్యం బొమ్మలు ముద్రించి ఇచ్చారని, ఇది రైతుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, అందువల్లనే రైతు పక్షపాతి అయిన కూటమి ప్రభుత్వం వారి ఆత్మ గౌరవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో కాలయాపన చేసిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు భరోసా కల్పిస్తూ రికార్డు కాలంలో రీ-సర్వేను పూర్తి చేసి పాస్ పుస్తకాలు అందజేస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ” నినాదంతో రైతుల భూములకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శక పద్ధతిలో ఈ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు.ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, గ్రామాల్లోనే శిబిరాలు ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు.అనంతరం దెందులూరు మండలంలో నూతనంగా మంజూరైన స్పౌజ్ క్యాటగిరి ఫించనులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ సెక్రటరీ నాగనబోయిన సత్యనారాయణ, తహశీల్దార్ బి.సుమతి, ఎంపీడీవో ప్రతాప్, క్లస్టర్ ఇంచార్జ్ పరస వెంకటరావు, కూటమి నాయకులు కమ్మ శివరామ కృష్ణ, సొసైటీల చైర్మన్లు గారపాటి కొండయ్య చౌదరి, డాక్టర్: పసుమర్తి మధు, యలమర్తి వీర వెంకట సత్యనారాయణ, యలమర్తి శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షులు గారపాటి రంగారావు, వెన్నమనేని రాజా సహా పలువురు కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

