NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కారాదు – సెట్కూరు సీఈఓ

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు:  జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, కొమ్మేమర్రి, డ్.హుస్సేనాపురం, నంద్యాల జిల్లా నందు డ్రగ్స్ దుర్వినియోగం మరియు యోగాంధ్ర ఫై అవగాహనా కార్యక్రమం నిర్వహించడమైనది.  ఈ సందర్బంగా సెట్కూరు సీఈఓ డా!! వేణుగోపాల్  మాట్లాడుతూ కౌమార దశలో విద్యార్థులు చెడు వ్యసనాల వైపు ఆకర్షితులు అయ్యే ప్రమాదం ఉందని కావున యువత మంచి ఆరోగ్య అలవాట్లను కలిగి ఉండాలని.  డ్రగ్స్ వ్యాపారులు, విద్యార్థులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని డ్రగ్స్ వాహకులుగా వాడుకునే ప్రమాదం ఉందని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని,  తాత్కాలిక ఆనందం కొరకు సరదాగా ప్రారంభించిన చెడు అలవాట్లే దుర్వ్యసనాలుగా మారుతాయి, వీటివల్ల ఆరోగ్యం దెబ్బ తినడం తో పాటు కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో అనుబంధాలు తగ్గిపోయి,  ఆర్థిక ఇబ్బందులు ఎదురు కొంటారని, జ్ఞాపక శక్తీ తగ్గి చదువు పట్ల అనాసక్తి కలుగుతుందని, ఉద్వేగాలు నియంత్రణలో ఉండవని కావున ప్రతి ఒక్కరు ఎదో ఒక క్రీడ ను హాబీగా అలవర్చుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. యోగ మానసిక ఆరోగ్యాన్ని పెంపోందిస్తుందని ప్రతి రోజు విద్యార్థులు యోగ చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు, కళాశాల ప్రధానాచార్యులు మరియు ఇతర అధ్యాపకులు యోగాండ్ర 2025 లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యార్థులకు వివరించి, విద్యార్థులందరూ జూన్ 21 వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ పి.సోమ శివా రెడ్డి, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ మురళి కృష్ణ,  సెట్కూరు పర్యవేక్షకులు శ్రీ శ్యాం బాబు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author