NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలిచే పార్టీ వైఎస్ఆర్సీపీ – జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె గిరి

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుందమండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె గిరి, మండల కన్వీనర్ షఫీ ఉల్లా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుండి ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న పార్టీ అని తెలిపారు. రైతుల కష్టాలు అర్థం చేసుకుని వారికి అండగా నిలబడిన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. అదే ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాలను గెలుచుకుందని అన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందాల్సిన అనేక సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని వారు విమర్శించారు. రైతులు, పేదలు, సాధారణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా, వైస్ ఎంపీపీ హనుమప్ప, ఎంపీటీసీ కంచప్ప, మల్లికార్జున, రామకృష్ణ, ఎం. రహమతుల్లాహ్, బి. తవాఫ్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని సంకల్పించారు.అలాగే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున పోరాటాలు మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు, మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు.

About Author