NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లికి వందనం అమలుతో వైసిపి నేతలకు నిద్ర పట్టడం లేదు

1 min read

కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం

కూటమి ప్రభుత్వం 67లక్షల బిడ్డలకు ఇచ్చింది

2029 ఎన్నికల్లో జగన్ కు జీరో సీట్లు

ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో ఉనికి కోసం ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరిస్తున్న మాజీ సీఎం జగన్ కు 2029 ఎన్నికల్లో జగన్ కు ఒక్క సీటు కూడా రాదని, తల్లికి వందనం అమలుతో వైసిపి నేతులకు నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి  అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి  విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల చిత్రపటాలకు పాలభిషకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ అమ్మ ఒడి కేవలం ఒక బిడ్డకు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉన్న  అంతమంది బిడ్డలకు రాష్ట్రంలో దాదాపు 67 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.13 వేల రూపాయలు జమ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను  నాశనం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంటే వైసిపి నేతులకు నిద్ర పట్టడం లేదన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలతో  ముందుకు పోతుంటే, వైసిపి కేవలం తప్పుడు ప్రచారం చేసుకుని  ఉనికి కాపాడుకుంటుందన్నారు. గతంలో వైసిపి అమ్మ ఒడి రూ 13 వేలు వేసిన సమయంలో 2 వేలు ఎవరి జేబులో పోయాయని  ప్రశ్నించారు. పాఠశాలల అభివృద్ధి కొరకు ప్రభుత్వం 15వేలలో 2 వేల రూపాయలు కేటాయిస్తే దాన్ని వైసిపి తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ చెడు ప్రచారం చేస్తున్న దాన్ని కూటమి నాయకులు తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలు వరుసగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,  కార్యకర్తలు కూటమి నేతలు పాల్గొన్నారు.

About Author