సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలి
1 min read

డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో సర్పంచులకు సత్కారం
నందికొట్కూరు న్యూస్ నేడు: రానున్న సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో వైసీపీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.నియోజకవర్గంలోని ఆరు మండలాలు నందికొట్కూరు,మిడుతూరు, జూపాడు బంగ్లా,పగిడ్యాల, కొత్తపల్లి,పాములపాడు మండలాల్లో ఉన్న వైసీపీ సర్పంచులకు శాలువా పూలమాలలతో డాక్టర్ సుధీర్ సన్మానించారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు,అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశామని అన్నారు.డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ సర్పంచుల ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ సర్పంచులకు సూచించారు. వైసీపీని మరింత బలోపేతం చేసి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు.లింగాపురం సర్పంచ్ నాగార్జున రెడ్డి,సర్పంచులు ఉషారాణి, కృష్ణవేణమ్మ,జయలక్ష్మమ్మ, రామచంద్రుడు,స్వామి రెడ్డి, వెంకటేశ్వర్లు,భూదేవి,షంషున్ భీ తదితర సర్పంచులను సత్కరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్,తువ్వా చిన్న మల్లారెడ్డి,తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి,అన్వర్ భాష, చిన్న రామచంద్రారెడ్డి,షరీఫ్ పాల్గొన్నారు.

